శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (10:48 IST)

తల నరికి జెండా దిమ్మెపై పెట్టారు... ఎక్కడ?

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు పట్టణ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తల మొండం వేరు చేశారు.

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు పట్టణ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తల మొండం వేరు చేశారు. ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనుక బొట్టుగూడ జెండా దిమ్మెపై మృతుడి తలను పెట్టారు. మొండెం మాత్రం కనిపించలేదు. 
 
మృతుడిని కనగల్‌కు చెందిన పాలకూరి రమేశ్‍గా గుర్తించారు. ఈయన ట్రాక్టర్ డ్రైవర్‍గా పనిచేస్తున్నాడు. రాత్రి టాబ్లెట్స్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమేశ్ ఇలా శవమై కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్వ్యాడ్‍తో నిందితుల కోసం వెతుకుతున్నారు.
 
మృతుడు రమేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా ఉన్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ వచ్చాడు. మందుల కోసం అని.. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఏమైందోగానీ.. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపారు.