శ్రీవారి ఆలయంలో ఆధిపత్య పోరు.. రమణ దీక్షితులు Vs డాలర్ శేషాద్రి
శ్రీవారి ఆలయం కలియుగ వైకుంఠం, తిరుమల వెంకన్న సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఆలయ ప్రత్యేక అధికారి డాలర్ శేషాద్రి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. ఇటీవల గర్భగుడిలోకి తన మనవడిని తీసుకెళ్లారన
శ్రీవారి ఆలయం కలియుగ వైకుంఠం, తిరుమల వెంకన్న సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఆలయ ప్రత్యేక అధికారి డాలర్ శేషాద్రి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. ఇటీవల గర్భగుడిలోకి తన మనవడిని తీసుకెళ్లారని.. మిరాశీ వ్యవస్థ ఎప్పుడో రద్దయినా.. రమణ దీక్షితులు ఇంకా పాటిస్తూనే వున్నారని డాలర్ శేషాద్రి బహిరంగంగానే ఆరోపించారు.
అయితే మనవడిని ఎందుకు గర్భగుడిలోకి తీసుకురాకూడదో తెలియజేయాలంటూ.. రమణ దీక్షితులు ఓ షోకాజ్ నోటీసును డాలర్ శేషాద్రికి పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పించడంలో రమణ దీక్షితులు, డాలర్ శేషాద్రిలదే పైచేయి.
అలాంటి వారి మధ్య వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తిరుమల వెంకన్న సన్నిధిలో ఇలాంటి ఆధిపత్య పోరు.. ఆలయ ప్రతిష్ఠకు దెబ్బతీస్తుందని.. వీరి వ్యవహారంలో టీటీడీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.