మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 2 మే 2019 (12:05 IST)

ప్రియుడితో కోడలు పడకగదిలో ఏకాంతం.. చూసేసిన అత్త... ఆ తరువాత?

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సాయినగర్ లోని నాలుగోవీధిలో ఉదయ్, అతని భార్య సులోచన, ఉదయ్ తల్లి రాజమ్మ నివాసముంటున్నారు. ఉదయ్, సులోచనలకు పెళ్ళయి సంవత్సరమైంది. అయితే ఉదయ్‌కు మాత్రం ఉద్యోగం లేదు. ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేసేవాడు ఉదయ్. 
 
ఉన్నట్లుండి ఉదయ్‌కు ఉపాధ్యాయుడి ఉద్యోగం వచ్చింది. అది కూడా పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో. దీంతో భార్య, తల్లిని వదిలిపెట్టి ఉద్యోగం కోసం ఏలూరుకు వెళ్ళాడు ఉదయ్. వారానికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యను సరదాగా బయటకు తీసుకువెళ్ళేవాడు ఉదయ్. ఆ తరువాత యధావిధిగా ఏలూరుకు వెళ్ళిపోయేవాడు.
 
భర్త వారంరోజులకు ఒకసారి రావడంతో సులోచన ఆలోచన పెడదారి పట్టింది. ఇంటి పక్కనే ఉన్న రాజశేఖర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండునెలల పాటు ఎవరికి అనుమానం రానివ్వకుండా ఈ బాగోతాన్ని నడిపింది. అయితే రెండు రోజుల క్రితం తన ఇంట్లోకే ప్రియుడు రాజశేఖర్‌ను పిలిపించుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని రాజమ్మ చూసేసింది.
 
దీంతో అత్తను తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది సులోచన. పోలీసులకు ఫోన్ చేసి దోపిడీ దొంగలు తన అత్తయ్యను హత్య చేశారని చెప్పింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన తల్లిని చంపేసిందని తెలియడంతో ఉదయ్ షాక్ తిన్నాడు.