శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (15:16 IST)

దేవుడికి హారతిస్తూ పూజారి కాలు జారి.. 100 అడుగుల నుంచి..?

Singanamala
అనంతపురం జిల్లా శింగనమలలో అపశృతి చోటుచేసుకుంది. దేవుడికి పూజలు చేస్తున్న సమయంలో పూజారి కాలు జారి లోయలో పడి మృతి చెందాడు. శ్రీ గంపమల్లయ్య స్వామికి శనివారం ఉదయం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పూజారి దేవుడికి హారతిస్తూ కాలు జారీ వంద అడుగులు ఉన్న కొండపై నుంచి కింద పడ్డాడు. దీంతో పూజారి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
పూజారి మృతితో ఆలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. శ్రావణమాసం కావడంతో స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తి.. స్వామికి వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు. శనివారం కూడా యథావిధిగా పూజ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో కొండ పైనుంచి గుహలోకి దిగే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి లోయలో పడ్డాడు. భక్తులందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. నిత్యం స్వామి పూజలో తరించే ఆ పూజారి.. అదే పూజలో ఉండగానే మృతి చెందడాన్ని భక్తులు జీర్ణించుకోలేకున్నారు.