మహానాడులో చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ.... ఏం జరిగింది?
తిరుపతి వేదికగా జరుగుతున్న మహానాడులో ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటివరకు క్రేజీవాల్, ఒబామాలపై చెప్పులు విసిరేసిన సంఘటనలు చూశాం. అయితే మొదటిసారి సిఎం చంద్రబాబుకు చెప్పు చూపించిం
తిరుపతి వేదికగా జరుగుతున్న మహానాడులో ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటివరకు కేజ్రీవాల్, ఒబామాలపై చెప్పులు విసిరేసిన సంఘటనలు చూశాం. అయితే మొదటిసారి సిఎం చంద్రబాబుకు చెప్పు చూపించిందో మహిళ. నువ్వు ఏం చేశావంటూ బాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సభావేదికపై ఉన్న బాబును చూస్తూ చెప్పు విసిరే ప్రయత్నం చేసింది. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీని మహానాడులో ఏర్పాటు చేశారు.
మహిళా గ్యాలరీలో కూర్చున్న మహిళ ఒక్కసారిగా మహానాడు జరుగుతుండగా పైకి లేచి బాబును తిట్టడం ప్రారంభించింది. పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్‌గా కూర్చుండి పోయారు. అయితే ఆ మహిళ చెప్పు విసిరే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నారు.
ఒకవేళ మహిళ చెప్పు విసిరి ఉంటే మాత్రం ఖచ్చితంగా బాబుపై పడి ఉండేది. వెంటనే పోలీసులు ఆ మహిళను పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఆ మహిళ ఎందుకు అలా చేసిందో ఇప్పటివరకు కూడా పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలకు సైతం అర్థం కాలేదు.