బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జులై 2023 (13:36 IST)

మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీక్.. 16 మందికి అస్వస్థత

chemical gas leak
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషవాయువు లీకైంది. మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీకైంది. చేపలను ప్రాసెసింగ్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 16 మంది కూలీలు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
బుధవారం ఉదయం చేపలను ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న వారు ఆ విష వాయువును పీల్చారు. దీంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు. వారంతా అపస్మారకస్థితిలోకి వెళ్లారని, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు. 
 
కార్మికలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు రిమ్స్‌లో చేర్పించినట్టు తెలిపారు. బాధిత కార్మికులంతా ఒరిస్సాకు చెందిన దినకూలీలు కావడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు కూడా తెలియరాలేదు.