మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (22:43 IST)

అమరావతి భూములు: ఆధారాలతో రండి ఆళ్లగారూ, వైసిపి ఎమ్మెల్యేకి సిఐడి నోటీస్

అమరావతి భూముల కేసు విషయంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీమంత్రి నారాయణకు సీఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధావారం నాడు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడి నోటీసులు ఇచ్చింది.
 
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు ఫైల్ చేసిన నేపధ్యంలో ఆ ఆధారాలతో సహా గురువారం నాడు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడి ఆఫీసుకు రావాలంటూ నోటీసు ఇచ్చారు.
 
కాగా ఆళ్లకు అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఇచ్చిన రైతులు ఎవరన్నది తేలాల్సి వుంది. సదరు రైతులు ఇచ్చే సాక్ష్యాలను సీఐడి రికార్డు చేసి కేసుపై దర్యాప్తు చేయాల్సి వుంది.