లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసి బస్సు, ఇద్దరికి తీవ్ర గాయాలు
గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చీకటీగలపాలేం వద్ద తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో పదిహేడు మందికి స్వల్ప గాయాలయ్యాయి.
కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కి మరో ప్రయాణికుడుకి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రధమ చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలయిన వారిని గుంటూరుకు తరలించారు 108 సిబ్బంది.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా వింజమూరుకు వెళుతోంది. కారంపూడి నుంచి నంద్యాల వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.