శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (10:47 IST)

నవంబర్ నెలాఖరులోగా అల్పపీడనం.. తేలికపాటి వర్షాలు

Rains
నవంబర్ నెలాఖరులోగా ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
బుధవారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇటీవలే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. 
 
దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.