శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (10:42 IST)

ఏపీలో రెండో అధికారిక భాషగా ఉర్దూ.. నోటిఫికేషన్ జారీ

ys jagan
ఏపీలో ఉర్దూను రెండో అధికారిక భాషగా  గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. 
 
ఏపీలో ఉర్దూ భాషకు అధికారిక హోదాకు సంబంధించి మూడు నెలల కిందటే అసెంబ్లీలో బిల్లు పాసైన సంగతి తెలిసిందే. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సభ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోగా, ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో దానిపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది.