1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:33 IST)

సీఎం జగన్ ఔదార్యం - కారుణ్య మరణం కింద ఒకరికి ఉద్యోగం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు ఔదార్యాన్ని చూపారు. కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన శుభవార్త చెప్పారు. ముఖ్యంగా, కోవిడ్‌ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నిమాయకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఈ ప్రక్రియను ఈ యేడాది నవంబర్‌ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధినిర్వహణలో అసువులు బాసిన ఉద్యోగులను ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందన్నారు. 
 
వారులేని లోటుతో ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలు కాకూడదని ప్రజల మనసెరిగిన ప్రభుత్వంగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అధికారులు కూడా ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.