శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (17:58 IST)

ఏప్రిల్ 2న జిల్లాల విభజనపై ప్రకటన-12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష

ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష జరిపినట్లు ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్‌ కుమార్ తెలిపారు. అయితే ఇంకా నెల్లూరు జిల్లా పూర్తి కాలేదని ప్రణాళిక శాఖ విజయ్‌ కుమార్ తెలిపారు. అది కూడా త్వరలో పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. 
 
ఏప్రిల్ 2న జిల్లాల విభజనపై ప్రకటన వస్తుందని.. అదే రోజు నుంచి కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభమవుతుందని విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో మండల నియోజకవర్గాలకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయన్నారు.
 
విశాఖ నుంచి 250, ఈస్ట్ గోదావరి నుంచి 300, విజయనగరం నుంచి 4వేలు, శ్రీకాకుళం నుంచి 40 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. శాస్త్రీయ పద్దతిలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేశామన్నారు.