ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (08:58 IST)

టీడీపీకి మరో షాక్... మరో ఎమ్మెల్యే గుడ్ బై?

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారిపోగా మరో ఇద్దరు ఊగిసలాడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరొకరు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. శనివారం నాడు ఆయన సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది.

గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు వాసుపల్లి గణేష్‌ దూరంగా ఉన్నారు. అయితే.. వైసీపీలో అధికారికంగా చేరకుండా ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటనే వాసుపల్లి గణేష్ కూడా ఎంచుకోనున్నట్లు తెలిసింది.

జగన్‌ను కలవనున్న గణేష్‌ వైసీపీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీకి మద్దతు తెలపనున్నట్లు సమాచారం.