మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (11:28 IST)

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

ap assembly
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కాగా, ఏపీకి కొత్త గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అబ్దుల్ నజీర్ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేయనున్నారు. ఆయన పాల్గొనే తొలి అధికారిక కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ ఉభయసభలు వాయిదాపడతాయి. ఆ తర్వా శానససభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై సభ నిర్వహణపై ఒక షెడ్యూల్‌ను ఖరారు చేస్తుంది. ఈ బీఏసీ సమావేశం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరుగుతుంది. 
 
ఇందులో అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. మరోవైపు ఈనెల 24వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ సమావేశాల్లో సీఎం జగన్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.