మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (11:28 IST)

ఏపీ మంత్రివర్గం భేటీ వాయిదా.. కారణం ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఈ రోజు(నవంబర్ 17) కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. 
 
అయితే, అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. 
 
ఇందులో కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి రానున్నాయి. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఒకే రోజున 14 ఆర్డినెన్సులు అసెంబ్లీ, మండలి ముందుకు రానున్నాయి.
 
మరోవైపు డిసెంబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదాపడింది.