బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 1 మార్చి 2018 (21:23 IST)

అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 5 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ

అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులుకు రూ. 5 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముందుగా 100 మందికి నష్టపరిహారం చెక్కులను అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ... ఎటువంటి నిబంధనలు ఉన్నా లెక్కచేయనని అన్నారు. అగ్రిగో

అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులుకు రూ. 5 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముందుగా 100 మందికి నష్టపరిహారం చెక్కులను అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ... ఎటువంటి నిబంధనలు ఉన్నా లెక్కచేయనని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామనీ, ఒక్కొక్కరికీ రూ.5 లక్షల వంతున మొత్తం ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు.
 
ప్రైవేటు పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు. ఎక్కువ వడ్డీలిస్తామని, రెండేళ్లల్లో రెట్టింపు చేస్తామనే ప్రచారాలకు మోసపోవద్దన్నారు. ప్రభుత్వ బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, డీజీపీ మాలకొండయ్య, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, ఎ. డిజిపి ద్వారకా తిరులమరావు పాల్గొన్నారు.
 
ఐదు రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ కార్యకలాపాలు జరుగుతున్నాయనీ, ఐదు రాష్ట్రాల్లో బాధితులున్నారని చెప్పుకొచ్చారు. ఇటువంటి సంస్థల కార్యకలాపాలపై నిఘా ఉంచామనీ, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆస్తులు జప్తు చేసి మరీ చెల్లిస్తామని చెప్పారు. తప్పుడు పనులు చేసే వారిని ఉపేక్షించనని అన్నారు. పేదలు కోర్టులకు వెళ్లి వ్యయప్రయాసలకు లోనవుతున్నారనీ, ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు డబ్బులు ఇప్పిస్తామని వెల్లడించారు.