శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (18:10 IST)

కోవిడ్ ప్రికాషన్ డోస్‌ వ్యవధి 6 నెలలకి తగ్గించాలి

దేశంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. కోవిడ్ మూడో వేవ్ ని ఎదుర్కొనేందుకు ప్రి కాషన్‌ డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ వ్యవధిని తగ్గించాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
 
 
దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఉపయోగమని కోవిడ్ సమీక్ష సమావేశంలో సీఎం జగన్  అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలా మందిని కోవిడ్‌ నుంచి రక్షించే అవకాశం ఉంటుందని సమావేశంలో అధికారులతో చర్చించారు. కోవిడ్ ప్రికాషనరీ డోస్ వ్యవధి తగ్గించాలని ప్రధానికి లేఖ రాయాలని జగన్ భావిస్తున్నారు.