గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (15:43 IST)

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం: ఆ జీవో ఉపసంహరణ

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 59ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. జీవో 59పై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించడం చట్ట విరుద్ధమని పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై విచారణ సందర్భంగా ఈ విషయంలో డ్రెస్‌కోడ్ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 
 
మహిళా పోలీస్ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇక కోర్టు విచారణ వారం పాటు వాయిదా పడింది.