సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (14:52 IST)

వివేకా హత్య కేసు : ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరించిన కోర్టు

వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ముగ్గురికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ5 నిందితులుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ఈ ముగ్గురు ప్రయత్నించారు. అయితే, హైకోర్టు అన్ని కోణాల్లో విచారించి వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు కడప సెంట్రల్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు.