Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల టైమ్ టేబుల్ రిలీజ్

Written By వరుణ్
Updated: మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 15వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి. ఆ తర్వాత ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సమయ నిర్ణయం పట్టికను రిలీజ్ చేసింది. 
 
ఈ పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మాత్రం ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. అలాగే, ఎన్వీరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను కూడా ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. 
 
ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు వరకు, ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేలా టైమ్ టేబుల్‌ను రిలీజ్ చేశారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments