శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (11:53 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తా - రాయలసీమల్లో వర్షాలు

Rains
బంగాళాఖాతంలో ఏర్పడివున్న అల్పపీడనం ప్రభావం కారణంగా సోమవారం దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడివుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనించి ఉత్తర శ్రీలంకలో తీరందాటి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. 
 
ఇది పశ్చిమ నైరుతి తీరం దిశగా పయనించి సోమవారం ఉదయానికి కొమెరిన్ తీరం దిశగా వస్తుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
మరోవైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని పాడేరు, చింతపల్లి, అరకు లోయ ఏజెన్సీ ప్రాంతాలను చలి భయపెడుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పాడేరు సమీపంలోని జి.మాడుగలలో ఆదివారం 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.