శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (11:10 IST)

రాముడు నడిచిన నేలపై ఏపీ మంత్రి ఆర్.కె.రోజా

rk roja
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తన అయోధ్య పర్యటనలో ప్రశాంతమైన జలాలపై బోట్ రైడింగ్ చేస్తూ, యోగా చేస్తూ ఆనందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంత్రి రోజా ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని మెడలో దండతో కనిపించారు.
 
ఈ వీడియోలో మంత్రి రోజా ప్రశాంతమైన ప్రకృతి మధ్య పడవలో ధ్యానం చేస్తూ, ఆనందమయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ విహరించే పక్షులకు ఆహారం అందజేశారు. 
 
అలా తన జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను వీడియోలో చిత్రీకరించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఆమె అయోధ్య రామమందిరాన్ని సందర్శించి శ్రీరామునికి పూజలు చేశారు.