శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (07:02 IST)

గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఎపి పోలీసులు

గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పేర్లు ఉన్నట్లు హైదరాబాద్‌ ఆబ్కారీ పోలీస్‌ శాఖ పేర్కొంది. ఉప్పల్‌లో నమోదైన గంజాయి స్మగ్లింగ్‌ కేసులో అనంతపురం జిల్లా హిందూపురం టూటౌన్‌ సిఐ శ్రీరామ్‌ పేరు ఉన్నట్లు తెలిపింది.

ఎపి పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో రెండు కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అనంతపురం జిల్లాకే చెందిన ఎఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ కృష్ణ సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆబ్కారీ పోలీస్‌ శాఖ తెలిపింది. సిఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.