ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (20:31 IST)

సాంకేతికతలో ఏపీ పోలీసుల ప్రతిభ.. ఐదు అవార్డులు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఐదు అరుదైన అవార్డులను పోలీసు శాఖ సొంతం చేసుకుంది. భువనేశ్వర్ లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన టెక్నాలజీ అవార్డ్స్ లో ఈ అరుదైన గౌరవం దక్కింది. 
 
2020లో సాంకేతిక పరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకు ఏపీ పోలీసు శాఖకు ఐదు బహుమతులు లభించాయి. భువనేశ్వర్ ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను ఏపీ పోలీసులు అందుకున్నారు. 
 
ఏపీలో విజయవంతంగా పోలీసు వీక్లీ ఆఫ్‌ విధానం అమలు, దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్‌ ట్రాకర్‌, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం, బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ -ఎస్సీ / ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు విధానం లో మొత్తం ఐదు అవార్డులు లభించాయి.