బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (17:02 IST)

డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ జారీచేసిన ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం డిపార్ట్‌మెంటల్ పరీక్షను నిర్వహిచనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహిస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీఅయింది. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించి దరఖాస్తు విధానంపై స్పష్టతనిచ్చింది. 
 
ఎవరైతే ఉద్యోగులు ఈ పరీక్షలకు హాజరవుతారో.. వారంతా ముందుగా.. ఏపిపిఎస్సీ వెబ్‌సైట్‌లో ఆయా ఉద్యోగులు ఓటిపిఆర్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. వారికి ఓటిపిఆర్‌లో వ‌చ్చే యూజ‌ర్ ఐడితో అన్‌లైన్‌లో ధ‌ర‌కాస్తుకు చేసుకోవాలని సూచించింది. 
 
ఈ నెల 13 నుండి 17 వ‌ర‌కు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుకు చేసుకొనేందుకు అవ‌కాశం ఉన్నట్లుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు మొత్తం 100 మార్కుల‌కు పరీక్ష నిర్వ‌హిస్తుండ‌గా.... అందులో 40 మార్కులు పైగా వ‌చ్చిన ఉద్యోగుల‌కు మాత్రమే ప్రొబేష‌న‌రీకి అర్హ‌త సాదించ‌నున్నారు.