శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (09:24 IST)

ఆర్టీసీ బస్సుకు పేరు పెట్టండి... బహుమతి గెలుచుకోండి..

apsrtc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఈ సంస్థ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ బస్సులకు కొత్త పేర్లను పెట్టనుంది. ఈ బస్సులకు సరైన పేర్లు సూచించాలని కోరింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీస ఎండీ ఓ విజ్ఞప్తి చేశారు. 
 
దూర ప్రాంతాల సర్వీసుల కోసం కొత్తగా ప్రవేశపెడుతున్న నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు సరైన పేరు సూచించాలని ఆర్టీసీ ఎండీ కోరారు. ఒక్కో బస్సులో 30 బెర్తులు, ప్రతి బెర్త్‌కు ఫ్యాన్‌, రీడింగ్‌ ల్యాంప్‌ ఉంటాయన్నారు. తమ బ్రాండ్‌ సర్వీసు తెలిపేలా మంచి పేరును సూచిస్తే, నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. బస్సు పేరును [email protected] అనే మెయిల్‌కు పంపాలని ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు.