శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (15:04 IST)

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

budameru gandlu
విజయవాడ మహనగరంలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవంతంగా పూడ్చివేశారు. భారీ వర్షాలకు నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో బుడమేరుకు వాగుకు మూడు చోట్ల గండ్లు పడిన విషయం తెల్సిందే. విజయవాడను వరద ముంచెత్తింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన జలవనరులల శాఖ అధికారులు బుడమేరు గుండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు. ఏజెన్సీల సాయంతో రెండు గండ్లను పూడ్చిన అధికారులు.. అతిపెద్దదైన మూడో గండిని భారత ఆర్మీ సాయంతో పూడ్చివేశారు. ఈ గండ్లు పూడ్చివేత వీడియోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్వీట్టర్ హ్యాండిల్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. 
 
"బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తి. పెద్దదైన మూడో గండిని కూడా పూడ్చిన సిబ్బంది. 90 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చిన అధికారులు. మొత్తం 3 గండ్లు పూడ్చడంతో దిగువ ప్రాంతాలకు ఆగిన వరద. 5 రోజులుగా నిరంతరాయంగా కొనసాగిన పనులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో, అక్కడే ఉండి పనులు పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎప్పటికప్పుడు మంత్రి నిమ్మలతో సమన్వయం చేసుకుంటూ, కావాల్సిన వర్కర్లు, సామాగ్రిని సరఫరా చేస్తూ సహకారం అందించిన మంత్రి లోకేష్. మూడో గండి పూడ్చివేతలో సహకరించిన ఆర్మీ" అంటూ పేర్కొంది