సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (18:54 IST)

ఆ ఐదుగురు జడ్జీలకు అదనపు భద్రత

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో తీర్పుచెప్పిన సుప్రీంకోర్టు జడ్జిలు ఐదుగురికి సెక్యూరిటీ పెంచారు. వాళ్లుంటున్న ఇళ్ల దగ్గర అదనంగా సెక్యూరిటీ టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. 

ఇళ్ల దగ్గర బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మొబైల్‌‌ ఎస్కార్ట్‌‌ టీమ్స్‌‌‌ను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు. సీజేఐ జస్టిస్‌‌ రంజన్‌‌ గొగొయ్‌‌, సీజేఐ డిజిగ్నేట్‌‌ జస్టిస్‌‌ శరద్‌‌ ఆర్వింద్‌‌ బాబ్డే, జస్టిస్‌‌ డి.వై. చంద్రచూడ్‌‌, జస్టిస్‌‌ అశోక్‌‌ భూషణ్‌‌, జస్టిస్‌‌ ఎస్‌‌.అబ్దుల్‌‌ నజీర్‌‌లు ఏళ్లపాటు నానుతున్న అయోధ్య కేసులో శనివారం తీర్పు చెప్పారు.

ఏ ఒక్క జడ్జికీ ఎలాంటి బెదిరింపులు రాకపోయినా ముందుస్తు చర్యల్లో భాగంగానే సెక్యూరిటీని పెంచినట్టు సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రతి జడ్జి వెహికల్‌‌కి ఆర్మ్డ్‌‌ గార్డ్స్‌‌ ఉన్న ఎస్కార్ట్‌‌ వెహికల్స్‌‌ సెక్యూరిటీగా ఏర్పాటుచేశారు.