బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (08:49 IST)

గిరిజనుల కోసం మాట్లాడే అర్హత బాబుకి లేదు: పుష్ప శ్రీవాణి

గిరిజనులకు తాము ఎన్నో చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి వాటిని నిలిపేసిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. 
 
ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పుష్ప శ్రీవాణి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో గిరిజనులను అవమానించి, వారి పట్ల వివక్ష చూపించి, గిరిజనుల హక్కులను కాలరాసిన చంద్రబాబు చరిత్రలో ఎప్పటికీ గిరిజనుల ద్రోహిగా నిలిచిపోతారని, గిరిజనుల కోసం మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు.

అసలు గిరిజనుల కు ఏ సంక్షేమ పథకం చంద్రబాబు పెట్టారని, తాము నిలిపేశామనడం విడ్డూరంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. గిరిజనుల తరఫున జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని పున సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహణ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసిందని అన్నారు.

అసలు సుప్రీం కొోర్టులో జీవో నెంబర్ 3 కొట్టేయడానికి కారణం చంద్రబాబే అన్న విషయం గిరిజనులందరికీ తెలుసన్నారు.లోప భూయిష్టంగా జీవో నెంబర్ 3 ని జారీ చేశారని, చట్టాలు సవరించకుండా జీవో జారీ చేసి ఇప్పుడు గిరిజనులకు ఇబ్బందులు పడే పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమన్నారు.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల హక్కుల కాపాడేందుకు వారి తరఫున సుప్రీం కోర్టులో ప్రభుత్వమే పోరాడుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర చరిత్రలో కాినీ, దేశ చరిత్రలో కానీ ఎవ్వరూ అమలు చేయని పథకాలను గిరిజనుల కోసం అమలు చేస్తున్న గిరిజన పక్షపాతి అని పుష్ప శ్రీవాణి అన్నారు.

గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజనుల కోసం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారని, గిరిజనులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సబ్ ప్లాన్ కింద 5 వేల 177 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. 

దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా గిరిజనులకు శాశ్వత ఉపాధి కల్పించేలా వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను రికార్డ్ స్థాయిలో పంపిణీ చేసిన ఘనత కూడా ముక్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

గిరిజనులను చంద్రబాబు అంటరానివారిగా చూసి కేబినెట్ లో కూడా అవకాశం ఇవ్వలేదని, కానీ జగన్మోహన్ రెడ్డి గిరిజనులను కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం గిరిజనుల అదృష్టమన్నారు.

గిరిజనులకు చరిత్రలో ఎన్నడూ ఎవ్వరూ అమలు చేయని విధంగా 2,225 రూపాయల ఫింఛన్, 15000 అమ్మ ఒడి, గిరిజనులకు ప్రతీ ఏటా రైతు భరోశాను 13,500 ఇస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమన్నారు పుష్ప శ్రీవాణి.

గిరిజన ప్రాంతంలో నూటికి నూరు శాతం స్థానిక సంస్థలు గిరిజనులకే కేటాయించామని, గిరిజన నిరుద్యోగ యువతకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 వేలకు పైగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయాల్లో కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదే అన్నారు.

చంద్రబాబు హయాంలో గిరిజనులకు ఏనాడైనా ఇన్ని ఉద్యోగాలు భర్తీా చేసిన చరిత్ర ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యావకాశాలను మెరుగుపరిచేందుకు నాడు నేడు తో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, మరో వైపు పసిబిడ్డలు, బాలింతలు, గిరిజన స్కూల్ పిల్లలు కు పౌష్టికాహారాన్ని అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్న గొప్ప మానవతా వాది మా ముఖ్యమంత్రి జగన్మొోహన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు శాశ్వతంగా, మైదనా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, సాలూరులో గిరిజన యూనివర్సిటీ, అరకులో గిరిజన స్టేట్ యూనివర్సిటీ, 5 ఐటీడీఏ ల పరిధిలో  మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారన్నారు.

అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు చంద్రబాబుకి లేదన్నారు. చంద్రబాబు గిరిజనుల ద్రోహి కనుకనే మొత్తం గిరిజన ప్రాంతంలోని ఏడు నియోజకవర్గాల్లోనూ గిరిజనులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి గెలిపించారన్నారు. గిరిజనులు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా గిరిజనులు మాత్రం నమ్మే ప్రసక్తే  లేదన్నారు.