Daily Horoscope
✕

ఏపీలో ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

Written By ఠాగూర్
Updated: గురువారం, 22 అక్టోబరు 2026 (19:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు గురువారం రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే యేడాది ఫిబ్రవరి నెల 24వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. జనరల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు; ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా తెలిపింది.
 
ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌ (ఆదివారాల్లో సహా) ఉంటాయని వెల్లడించారు. అయితే, ఇది తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ఏ రోజు ఏ సబ్జెక్టుకు పరీక్ష జరుగుతుందనే వివరాలతో పూర్తి టైం టేబుల్‌ని ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు. 
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Happy birthday Prabhas :టాలీవుడ్ ను కొత్త యుగంలోకి తీసుకెళ్తున్న కల్కి.. ప్రభాస్

రొమాన్స్‌, సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్‌ చిత్రం

AK 47; దీపావళి కి ముందు ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 వచ్చేస్తుంది

కయదు లొహర్ తాగిపడేసిన వాటిర్ బాటిల్ ధర రూ.3 లక్షలా?

పిల్లల, పెద్దలు సమ్మర్ హాలిడేస్ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు : ధీరజ్ మొగిలినేని

తర్వాతి కథనం
Show comments