బెజవాడ దుర్గమ్మ గుడి వద్ద 'లైవ్’లో క్రైస్తవ మత ప్రచారం...
దసరా ఉత్సవాల ప్రారంభం రోజున అన్యమత ప్రచారం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కనక దుర్గ అమ్మవారి ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసే ఎల్.సి.డి. స్క్రీన్ పై క్రైస్తవ మత బోధకుడి ప్రసంగాన్ని ప్రసారం చేశారు.
అమ్మవారి దసరా ఉత్సవాలకు ప్రచారం కల్పించే బాధ్యతలను సమాచార, పౌరసంబంధాల శాఖకు అప్పగించారు. ఆ శాఖ అధికారులు ఉత్సవాల ప్రత్యక్ష ప్రసార బాధ్యతలను స్థానిక చానల్ కు అప్పగించారు. గురువారం రాత్రి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేసిన కాసేపటికి అన్యమత బోధకుడి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. దాంతో ఆగ్రహం చెందిన భక్తులు రాళ్లతో ఎల్ఈడీ స్క్రీన్ ని ధ్వంసం చేశారు.
ఇంద్ర కీలాద్రిపై అమ్మవారి గుడికి వైసీపీ రంగులతో లైట్ల అలంకరణ చేయడంపైనే సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి, దానికి తోడు నిన్న ఎల్ .ఇ.డి. స్క్రీన్ లలో జరిగిన అన్యమత ప్రచారంతో హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిన్న ఇంద్రకీలాద్రి పై జరిగిన అన్యమత ప్రచారానికి బాధ్యులైన సమాచార పౌర సంభందాల శాఖ ఉద్యోగులను వెంటనే విధుల నుండి తొలగించాలని బీజేపీ డిమాండు చేస్తోంది.
జరిగిన సంఘటన మీద పూర్తి విచారణ చేసి, బాధ్యులైన అందరి అధికారులను కఠినంగా శిక్షించాలని, భారతీయ జనతపార్టీ విజయవాడ పార్లమెంట్ జిల్లా ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ ని కలిసి మెమొరాడం అందజేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, స్టేట్ ప్రోటోకాల్ ఇన్చార్జ్ తోట శివనాగేశ్వర రావు తదితరులు కలెక్టర్ ని కలిసినవారిలో ఉన్నారు.