ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (17:30 IST)

బీజేపీకి షాక్... జనసేన పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే

ఏపీలో భారతీయ జనతా పార్టీకి సొంత పార్టీకి చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు షాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. బీజేపీతో పాటు.. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ఆకుల సత్యనారాయణ. 
 
రాజమహేంద్రవరం సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన్ను పార్టీలోకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఆహ్వానం పలికారు. ఈ పిలుపునకు స్పందించిన ఆకుల సత్యనారాయణ... బీజేపీ రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఈనెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ఈలోపే తన శాసనసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఆకుల సత్యనారాయణ సతీమణి లక్ష్మీపద్మావతి గత ఐదేళ్లుగా జనసేన పార్టీలో కొనసాగుతోంది.