మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (17:07 IST)

నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ వినోద్‌ కిడ్నాప్..

బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ వినోద్‌ను కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. విజయవాడ పెనమలూరు పీఎస్‌ పరిధిలో తన భర్తను నిన్నరాత్రి (ఆదివారం) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆయన భార్య ప్రశాంతి అనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వినోద్‌ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా సిల్వర్‌ కలర్‌ కారులో  వినోద్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. 
 
వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్‌ చేశారని వినోద్‌ భార్య.. ప్రశాంతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.