మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (12:40 IST)

కేసీఆర్ ఒక్కశాతం అక్షరాస్యత కూడా పెంచలేదు: లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి దయనీయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లి ఏవీ ప్రభుత్వ పాఠశాలలో మార్గదర్శి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఒక్క శాతం కూడా అక్షరాస్యత పెరగలేదన్నారు. ఎంతో మంది గొప్పవాళ్లను అందించిన సర్కారు బడికి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. 
 
కేసీఆర్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనీ.. ఇంటర్మీడియట్, ఎంసెట్ ఫలితాలే ప్రభుత్వం సర్కారీ విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెబుతోందని అన్నారు. కొత్తగా టీచర్లను నియమించకపోవడం వల్లే విద్యార్థులకు సరైన చదువు అందడం లేదన్నారు.