శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:04 IST)

జేపీ నడ్డాతో గంగుల భేటీ - ఏపీలో పార్టీ బలోపేతానికి కృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని  ఎమ్మెల్యే, ఎంపీ, తెదేపా నేత గంగుల ప్రతాపరెడ్డి, కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్, ఆదాయ పన్నుశాఖ విశ్రాంత కమిషనర్ కంచర్ల హరిప్రసాద్, తెదేపా చిత్తూరు ఓబీసీ సెల్ కార్యదర్శి డి.వెంకయ్య, తెదేపా దివంగత ఎంపీ లాల్ జాన్ బాషా సోదరుడు గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ షేక్ నిజాముద్దీన్, ప్రముఖ వ్యాపారవేత్త మజర్ బేగ్‌లు వెల్లడించారు. 
 
వీరంతా తమ అనుచరులతో కలసి భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో డిల్లీలో భాజపాలో చేరారు. అనంతరం భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. రాయలసీమలో సమస్యలు, పరిష్కారమార్గాలపై సూచనలు చేశారు. 
 
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో సుపరిపాలన సాధ్యమైందని, వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ అభివృద్ది కార్యక్రమాల్లో తాము కూడా పనిచేయాలని నిర్ణయించుకుని పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. 
 
రాష్ట్రంలో 2023 లో జరిగే ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, భాజపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.