ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:10 IST)

టెన్త్ - ఇంటర్ పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు తిరస్కరణ

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్ల వల్ల విద్యార్థులు ఆయోమయానికి గురవుతారని, విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంటుందని వ్యాఖ్యానించింది. విద్యార్థుల్లో తప్పుడు విశ్వాసాన్ని కలగజేసే ఈ తరహా పటిషన్లు సంప్రదాయంగా మారకూడదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనునమ్న టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కోర్టులో దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
విద్యార్థులతో పాటు విద్యావ్యవస్థలోనే గందరగోళాన్ని సృష్టించే ఈ తరహా పిటిషన్లు ఇకపై సంప్రదాయం కాకూడదన్న భావనతో ఈ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.