సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (11:02 IST)

ఉండవల్లి కాల్ మనీ కింగ్ ... చంపేస్తాన‌ని బెదిరింపులు

సాక్షాత్తు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొలువైన తాడేప‌ల్లి ప్రాంతంలో కాల్ మ‌నీ వ్యాపారం కోర‌లు చాస్తోంది. ఈ ప్రాంతంలో కాల్ మ‌నీ కింగ్ గా పేరొందిన ఒక వ్య‌క్తిపై తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. 
 
 
ఉండవల్లి చెందిన మణికంఠ అనే కాల్ మనీ వ్యాపారి మ‌ణికంఠ‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారీ వ‌డ్డీకి న‌గ‌దు అప్పుగా ఇచ్చి, ఇప్ప‌టికిప్పుడు నగదు చెల్లించకపోతే రౌడీషీటర్ల చేత చంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు మణికంఠపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇల్లు అమ్మి డబ్బులు చెల్లిస్తానని ప్రాధేయపడ్డా కాల్ మనీ కింగ్ కనికరించడం లేద‌ని  పేర్కొంటున్నారు.
 
బాధితుడి ఇల్లు ఆక్రమించిన మణికంఠ, ఖాళీ చేయమంటే దిక్కున చోట చెప్పుకోవాలంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఫిర్యాదు చేశారు. బాధితులు ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించారు. మణికంఠపై అనేక అక్రమ వ్యాపారాల ఆరోపణలున్నాయి. గత కొంతకాలంగా కాల్ మని, అక్రమ వడ్డీ వ్యాపారాలకు ఉండ‌వ‌ల్లి కేంద్రంగా మారింది. దీనిపై పోలీసులు దృష్టి పెట్టాల‌ని కోరుతున్నారు.