గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (22:20 IST)

ధనాన్ని కోరుకునేవారు ఇలా చేస్తే....? (video)

తలస్నానం చాలామంది ఎపుడుపడితే అపుడు చేసేస్తుంటారు. కానీ తలంటు స్నానం చేయడానికి బహుళ అష్టమి, అమావాస్య, పూర్ణిమ, సంక్రమణాలు, మాసశివరాత్రులు, శుక్ల అష్టమి, ద్వాదశి, పాడ్యమి, షష్ఠి, చతుర్ధశి, శ్రాద్ధం రోజులు, ప్రయాణం రోజు, దీక్షామధ్యలో, అశ్విని, ఆర్ధ్ర, శ్రవణం, జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలలో, మంగళ, గురువారాలలో తగదు. ధనాన్ని కోరుకునేవారు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత తలస్నానం చేయాలి. 

 
వారాల విషయానికి వస్తే.... 
ఆదివారం - అందం తగ్గుతుంది. కలత, సంతాపం కలుగుతుంది. కానీ అవసరమైతే నూనెలో పూలు వేసి తలంటుకుని చేయవచ్చు. 
 
సోమవారం - మంచిది కాదు. కాంతి హీనత, భయం ఉంటాయి.
 
మంగళవారం - విరోధం, అపాయం, ఆయుఃక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది
 
బుధవారం - అన్నివిధాలా శుభం
 
గురువారం - అశాంతి, విద్యా లోపం, ధన వ్యయం, కీడు, శత్రు వృద్ధి. అవసరమైతే నూనెలో గరిక వేసి తలంటు స్నాం చేయాలి. 
 
శుక్రవారం - అశాంతి, వస్తునాశం, రోగప్రదం. కానీ కొందరు సౌఖ్యప్రదమని అంటారు.
 
శనివారం - ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ, కుటుంబ సౌఖ్యం, భోగం, శుభం కలుగుతుంది.