సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (10:17 IST)

ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్

సీబీఎస్ఈ  సిలబస్ ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రానుంది. నూతన విద్యావిధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో 28 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించనున్నారు.  
 
ఇప్పటితే నూతన విద్యావిధానం అమలులో భాగంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఒకే పాఠశాలలో విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 
 
ఈ విధానం అమలులో భాగంగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో కొన్ని పాఠశాలలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇది అమలైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరే అవకాశం ఉంటుంది.
 
సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధనకు జిల్లాలో 28 పాఠశాలలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 27 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఒకటి ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ఉంది. అలాగే మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.