ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (10:25 IST)

జనవరి 31నుంచి పార్లమెంట్​ సమావేశాలు, ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర బ‌డ్జెట్

న్యూఢిల్లీలో పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు కీల‌కం అయిన కేంద్ర బ‌డ్జెట్ త‌యారీలో ఆర్ధిక శాఖ నిమ‌గ్నం అయి ఉంది. ఈసారి కూడా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర బ‌డ్జెట్ ని ప్ర‌వేశ‌పెడుతున్నారు.
 
 
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్​ 8 వరకు జరగనున్నాయి. పార్లమెంట్​ వ్యవహారాల కేబినెట్​ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  తొలి రోజు ఉభయ సభల్లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల తొలి అర్ధ భాగం ఫిబ్రవరి 11న ముగియనుంది. నెల రోజుల విరామం తర్వాత మార్చి 14న తిరిగి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభమై, ఏప్రిల్​ 8 వరకు జరగనున్నాయి.