ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (12:18 IST)

గ్రామ దేవత గుడికి దారి చూపిన సీఎం చంద్రబాబు.. ఎలా?

chandrababu naidu
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీలోని తన స్వగ్రామంలో ఉన్న గ్రామ దేవత (అమ్మావారి) ఆలయానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దారి చూపించారు. ఈ ఆలయానికి రాకపోకలు సాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా సీఎం బాబు ఉదారతతో దారి చూపించారు. కందులవారి పల్లె పంచాయతీ నారావారిపల్లెలోని నాగాలమ్మ ఆలయంలో గ్రామస్థులు నిత్యం పూజలు చేస్తుంటారు.
 
ప్రతి యేటా సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గ్రామానికి వచ్చి నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, ఈ ఆలయానికి వెళ్లేందుకు సరైన దారి లేదని స్థానికులు ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ రోడ్డు వేసేందుకు ప్రైవేటు స్థలాలు అడ్డుగా ఉండటంతో చంద్రబాబు తానే 90 సెట్ల విస్తీర్ణాన్ని కొనుగోలు చేశారు. ఆ భూమిలోని రాకపోకలు సాఫీగా వెళ్లేలా రోడ్డు నిర్మించనున్నారు. చంద్రబాబు ఉదారతను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.