సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (15:55 IST)

హత్యకుగురైన పుంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం బాబు ఫోన్

chandrababu naidu
ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక అస్పియా అంజుమ్ సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో శవమై తేలడం సంచలనంగా మారింది. ఈ బాలికను హత్య చేసిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో పడేసినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోను ద్వారా పరామర్శించారు. 
 
ఆదివారం బాలిక నివాసానికి మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఫరూక్ వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న చిన్నారి కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చిన్నారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా మాట్లాడించారు. 
 
ఈ సందర్భంగా చిన్నారి తండ్రికి సీఎం బాబు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా, చిన్నారి హత్య కేసులో హోం మంత్రి అనిత స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఐదుగురు అనుమానితులను గుర్తించామని తెలిపారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని ఆమె తెలిపారు.