మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (10:09 IST)

జగన్‌పై కమెడియన్ వేణుమాధవ్ సెటైర్లు (వీడియో)

వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మరోమారు నోరుపారేసుకున్నారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందటూ సెటైర్లు వేశారు. పాపం జగన్ కష్టం తీర్చలేనిదంటూ వ్యాఖ్యానించారు.

వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మరోమారు నోరుపారేసుకున్నారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందటూ సెటైర్లు వేశారు. పాపం జగన్ కష్టం తీర్చలేనిదంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా వేణుమాధవ్ అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు చెప్పారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఆ తర్వాత జగన్ గురించి మాట్లాడుతూ, జగన్ చాలా కష్టపడుతున్నారు. ఐదు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. కోర్టుకెళ్లాని.. మళ్లీ వచ్చి పాదయాత్ర చేయాలి ఇలా జగన్ చాలా కష్టపడుతున్నారనీ, ఆయన కష్టం ఎవరూ తీర్చలేనిదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.