గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:50 IST)

55వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు

అమరావతి రైతుల ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. రైతుల ద్విచక్రవాహన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినందున.. శిబిరాల్లోనే నిరసన దీక్షలు చేయనున్నారు.

మందడం, తుళ్లూరులో ధర్నాల్లో రైతులు పాల్గొననున్నారు. వెలగపూడి, మందడంలో 24 గంటల దీక్ష చేయనున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, నవులూరు గ్రామాల్లో నిరసనలు చేపట్టనున్నారు.
 
భిన్నరూపాల్లో అమరావతి రైతుల ఆందోళనలు
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. విభిన్న రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు.

తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ వనదేవతలను ప్రార్థించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్‌ వద్ద ధర్నా ఐకాస, విద్యార్థులు నిర్వహించారు. అమరావతికి చిత్రపరిశ్రమ మద్దతు తెలపాలని డిమాండ్‌ చేశారు.
 
వారి వల్ల అమరావతి ఉద్యమానికి పైసా లాభం లేదు
ఉద్యోగ సంఘాల వల్ల అమరావతి ఉద్యమానికి పైసా లాభం కానీ నష్టం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎవరొచ్చినా, రాకున్నా మీ ధర్మ పోరాటం ఆపకండిని రైతులకు సూచించారు. అమరావతి కోసం ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగించండని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. 
 
‘ప్రస్తుతం ఉన్న ఉద్యోగ సంఘాలు స్వార్థ ప్రయోజనం కోసం పని చేస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక ముందే విశాఖపట్నం వెళదాం అని ప్రచారం చేస్తున్నారు.

రాజధాని పూర్తిగా విశాఖపట్నంలో పెట్టినా ఏడెనిమిది వేల మంది సచివాలయం నుంచి‌ వెళతారు. అదంతా ఇప్పుడు అయ్యే పని కాకున్నా.. అంతా అయిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఉద్యోగ సంఘాల్లో ఎన్ని‌ వివాదాలు ఉన్నాయో త్వరలో వెలుగులోకి వస్తాయి’ అని అశోక్ బాబు కామెంట్స్ చేశారు.
 
ప్రజావేదిక కూల్చివేత జగన్ అవివేకం : శైలజానాథ్
ప్రజావేదిక కూల్చివేత జగన్ అవివేకమని ఏపీ పీసీసీ చీఫ్ శైలాజానాథ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు.

పాలనలో వైఎస్ జగన్ విఫలమయ్యారన్నారు. మండలి రద్దు నిర్ణయం వైఎస్ ను అవమానించడమేనన్నారు. ఎన్నార్సీ, సీఏఏకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు.