Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతి దిండుతో నొక్కిపట్టుకోగా, నేను ఇనుపరాడ్‌తో కొట్టా: రాజేష్

సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితురాలైన స్వాతి జైలులో ఏమాత్రం ఆందోళన లేకుండా కాలం గడుపుతుందట. ప్రేమికుడి మోజులో పడి.. భర్తను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. స్వాతి జైలులో వున్నా

Written By selvi
Updated: ఆదివారం, 17 డిశెంబరు 2017 (17:50 IST)
సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితురాలైన స్వాతి జైలులో ఏమాత్రం ఆందోళన లేకుండా కాలం గడుపుతుందట. ప్రేమికుడి మోజులో పడి.. భర్తను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. స్వాతి జైలులో వున్నా ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించట్లేదని... యోగాలు చేసుకుంటూ వుందని జైలు అధికారులు వెల్లడించారు. 
 
స్వాతికి అధికారులు 687 నెంబరును కేటాయించారు. మొత్తం 13 మంది ఖైదీలు ఉన్న గదిలో ఆమెను కూడా ఉంచారు. కస్టడీ అనంతరం రిమాండ్ నిమిత్తం ఆమెను జైలుకు తరలించగా, తొలి రోజు ఉదయం ఆమె కాసేపు యోగా చేసిందని, ఆపై నిరక్షరాస్యులైన మహిళా ఖైదీలకు అక్షరాలు నేర్పిస్తూ, పాఠాలు చెప్పిందని అధికారులు చెప్పుకొచ్చారు.
 
ప్రియుడితో కలిసి జీవితం గడపడం కోసమే భర్తను చంపిన స్వాతికి కోర్టు రెండు వారాలపాటు రిమాండ్ విధించింది. సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతిని మహబూబ్ నగర్ మహిళా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. స్వాతి ప్రియుడి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుధాకర్ రెడ్డి మర్డర్ ప్లాన్ స్వాతిదేనని రాజేష్ పోలీసులకు చెప్పాడు. 
 
స్వాతి దిండుతో నొక్కిపట్టుకోగా, తాను ఇనుపరాడ్‌తో కొట్టి చంపామని తెలిపాడు. తర్వాత కారులో మృతదేహన్ని ఫతేపూర్ అడవుల్లో తగలపెట్టామన్నాడు. ఇంటికి వచ్చాక యాసిడ్ దాడి జరిగిందంటూ డ్రామా ఆడామని వెల్లడించాడు. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని తన భర్తలా చలామణి కావాలని స్వాతినే కోరిందన్నాడు రాజేష్. సర్జరీకి కావాల్సిన డబ్బులును కూడా స్వాతినే సమకూర్చుతానందని పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments