శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (11:18 IST)

కట్టుకున్న భర్త కళ్లల్లో కారం కొట్టింది.. ప్రియుడిని కాపాడింది..

కట్టుకున్న భర్తను నుంచి ప్రియుడిని కాపాడింది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. ఏపీ, గుడివాడలోని వాంబే కాలనీలో నివసిస్తున్న కోసూరు మురళీకృష్ణ భార్యతో గొడవపడి వేరుగా వుంటున్నాడు. దీంతో ఒంటరిగా వున్న భార్య చీమలపాడు గ్రామానికి చెందిన గోకరాజుతో సహజీవనం చేస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని భర్త భార్య, గోకరాజుతో జగడానికి దిగాడు. ఈ వాగ్వివాదం ముదిరింది. 
 
మురళీకృష్ణ-గోకరాజులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో భర్త నుంచి ప్రియుడిని కాపాడేందుకు భార్య కళ్లలో కారం కొట్టింది. అతడు మంటతో విలవిల్లాడుతుండటంతో ప్రియుడితో కలసి అక్కడి నుంచి పరారైంది. 
 
ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన కొత్త ద్విచక్ర వాహనాన్ని దహనం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన గోకరాజును ఆసుపత్రికి తరలించారు.