శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (13:02 IST)

నెల్లూరు జిల్లా టిఫిన్ సెంటర్లో సిలిండర్ పేలుడు

నెల్లూరు జిల్లా టిఫిన్ సెంటర్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. వావిళ్లలోని ఓ హోటల్లో భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. 
 
ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ఎంత మంది ఉన్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. స్థానికులు ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులకు సమాచారం అదించారు. 
 
వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో మూడు సిలిండర్లు పేలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.