మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (17:28 IST)

ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. రూ.55 కోట్లు కేటాయింపు

LPG Cylinder
ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అంటే ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఊరట కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఈ ప్రాజెక్టును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
 
ప్రభుత్వ పథకం ప్రకారం, అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు కేటాయించింది.
 
కేబినెట్‌ సమావేశం అనంతరం చీఫ్‌ సెక్రటరీ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఈ ప్రాజెక్టు గురించి మీడియాకు వివరించారు. 1,84,142 అంత్యోదయ కార్డుదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. 
 
ఉచిత ఎల్‌పిజి సిలిండర్‌తో పాటు, గత సంవత్సరాల్లో గోధుమలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు క్వింటాల్‌కు రూ.20 బోనస్‌ను కూడా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన వివరించారు.
 
1. లబ్ధిదారుడు ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసి అయి ఉండటం తప్పనిసరి.
 
2. వ్యక్తి తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి
 
3. అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేయాలి.