శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (16:49 IST)

బ్యాచిలర్లకు గుడ్ న్యూస్-రేషన్ షాపుల్లో సిలిండర్లు

రేషన్ షాపుల్లో బియ్యంతో నిత్యావసర సరుకులతో పాటు రెండు, ఐదు కేజీల సిలిండర్లు అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ముందుగా హైదరాబాద్‌లో మలక్‌పేట్, యాకుత్‌పురా, చార్మినార్, నాంపల్లి, మెహిదీపట్నం, అంబర్‌పేట ప్రాంతాల్లో ఈ సిలిండర్లను ముందుగా అందుబాటులోకి తేనున్నారు.  
 
తాజాగా రేషన్‌ దుకాణాల్లోకి అందుబాటులోకి వస్తే అత్యవసరంగా గ్యాస్‌ సిలిండర్‌ అవసరం ఉన్న గృహ వినియోగదారులతో పాటు విద్యార్థులు బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 
 
డీలర్లకు రూ.40-50 కమిషన్ కూడా లభిస్తుంది. చిన్న సిలిండర్లను ఎవరైనా కొనవచ్చు. అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఐడీ ప్రూఫ్ చూపించి ఈ సిలిండర్ తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా రీఫిల్ చేయొచ్చు.