మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:28 IST)

కోడలిని లొంగదీసుకున్న మామ, మాయలో పడి భర్తను చంపేసిన భార్య

కోడలు అంటే కూతురుతో సమానం అంటారు. కానీ ఇక్కడ ఈ మామ కోడలి పట్ల కామాంధుడయ్యాడు. ఒకవైపు భర్త తాగుబోతు కావడంతో ఆ మామ పని సుళువైంది. కోడలిని లొంగదీసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. మామతో కమిట్ అయిన కోడలు ఇక తాగుబోతు భర్త ఎందుకని, ఇద్దరూ కలిసి అతడిని హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 35 ఏళ్ల లక్ష్మయ్యకు వినుకొండకు చెందిన సునీతకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు మగ పిల్లలు కూడా పుట్టారు. కాగా లక్ష్మయ్య తల్లి 30 ఏళ్ల క్రితం చనిపోయింది. మరోవైపు లక్ష్మయ్యకు తాగుడు అలవాటు వుంది. భార్యను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అర్థరాత్రి వచ్చి వున్నది తిని గురకపెట్టి నిద్రపోయేవాడు. మళ్లీ ఉదయం షరా మామూలే.
 
కొడుకుకి సర్దిచెప్పి అతడి తాగుడును మాన్పించాల్సిన తండ్రి, తన కోడలిపై కన్నేశాడు. కుమారుడు ఇంట్లో లేని సమయంలో కోడలిపై అఘాయిత్యం చేసాడు. ఇక అప్పట్నుంచి ఆమెతో లైంగికంగా కలుస్తూ వచ్చాడు. మామకి ఫుల్లు సపోర్టుగా మారిన కోడలు తమ సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడని, మొన్న ఆదివారం అర్థరాత్రి మారణాయుధాలతో అతడు గాఢ నిద్రలో వున్నప్పుడు హత్య చేసేసారు. ఐతే ఆ హత్యను పక్కదారి పట్టించాలని చూసారు కానీ సునీత పెద్ద కుమారుడు, ఆ హత్య చేసింది తన తల్లి, తాతలు అని చెప్పడంతో పోలీసులు వారిని అరెస్టు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.